దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు స్వల్ప లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి. సెన్సెక్స్ 46 పాయింట్ల లాభంతో 61,478 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 5 పాయింట్ల స్వల్ప లాభంతో 18,135 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.70 వద్ద కొనసాగుతోంది. ఎస్బీఐ, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, నెస్లే ఇండియా, పవర్‌గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, ఐసీఐసీఐ, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.