అతిగా ఆహారం తీసుకోవడం వల్ల రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అతిగా ఆహారాన్ని తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అధిక బరువు క్రమంగా ఊబకాయానికి దారి తీస్తుంది. శరీరంలో మెటబాలిజానికి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అతిగా తినే వారు ఆందోళన, డిప్రెషన్, కుంగుబాటు వంటి సమస్యలతో కూడా బాధపడుతూ ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.