పీరియడ్ వచ్చే సమయానికే అనుకోకుండా ఏవైనా శుభకార్యాలో, పండుగలో వస్తే 2,3 రోజులపాటు నెలసరి రాకుండా ఉండేందుకు మహిళలు ట్యాబ్లెట్స్ వాడుతుంటారు. అయితే ఎక్కువసార్లు ఇలా చేస్తే ఆరోగ్యంపై ఎఫెక్ట్ పడుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. నెక్ట్స్ టైం పీరియడ్‌లో బ్లీడింగ్ అధికం అవుతుంది. ఈ సమస్య కొంతకాలం అలాగే కొనసాగితే శరీరంలో హార్మన్ల అసమతుల్యత ఏర్పడవచ్చు. మానసిక ఆందోళన పెరగడం వంటి అనారోగ్యాలకు దారితీయడం జరగవచ్చు.