నేడు ఐపీఎల్ లో భాగంగా చెన్నై వేదికగా గుజరాత్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది.ఈ తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో గుజరాత్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. గుజరాత్ 20 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. గిల్ (42), రషీద్ ఖాన్ (30) కాసేపు పోరాడారు. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్, తీక్షణ్, జడేజా, పతిరనా తలో 2 వికెట్లు, తుషార్ 1 వికెట్ తీశారు.