భారత క్రికెట్ నియంత్రణ బోర్డు(BCCI) పర్యావరణ పరిరక్షణ కోసం వినూత్న నిర్ణయం తీసుకుంది. ఫ్లేఆఫ్స్ మ్యాచ్ లలో బౌలర్ ఒక్క డాట్ బాల్ వేస్తే 500 మొక్కలు నాటుతామని ప్రకటించింది. మంగళవారం చెన్నై, గుజరాత్ మధ్య జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్ లో మొత్తం 84 డాట్ బాల్స్ నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా 42 వేల మొక్కలు నాటనున్నట్లు ప్రకటించింది. బీసీసీఈ నిర్ణయంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.