ఐపీఎల్లో నేడు చెన్నై వేదికగా జరుగుతున్న లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.లక్నో సూపర్జెయింట్లు ఐపీఎల్-2023 నుండి నిష్క్రమించారు. ఎలిమినేటర్-1 మ్యాచ్లో ఆ జట్టుపై ముంబై ఇండియన్స్ 81 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన లక్నో 16.3 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌటైంది. ముంబై బౌలర్లలో ఆకాష్ మధ్వల్ 5 వికెట్లు తీశాడు.