శరీరంలో కొన్ని భాగాల్లో నొప్పులు వస్తే వెంటనే అలర్ట్ అవ్వాలని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఛాతీ నొప్పి, కిడ్నీలో నొప్పిని నిర్లక్ష్యం చెయ్యకూడదని అంటున్నారు. తేలికపాటి నొప్పులైనా అప్రమత్తమవ్వాలి. కాళ్ల నొప్పి, బొటన వేలులో తిమ్మిరి ఉంటే సయాటికా లక్షణాలు కావొచ్చు. కడుపులో నొప్పి, వికారం, వాంతులు వంటివైతే ప్యాంక్రియాటైటిస్ లక్షణాల్లో ఒకటి. తలనొప్పి, అలసట, చిరాకు వంటివి మైగ్రేన్ లక్షణాలని అంటున్నారు.