గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఉప్పును రోజులో 6 గ్రాముల కంటే ఎక్కువగా తీసుకోకూడదు. ప్యాకేజ్డ్ ఫుడ్స్, చిప్స్ తినకపోవడం మంచిది. పాలిష్ చేయని ధాన్యాలు తినడం ఉత్తమం. తక్కువ ఫ్యాట్ ఉన్న పాలతో పాటు చేపలు, నట్స్ తీసుకుంటే గుండెకు ఎంతో మేలు జరుగుతుంది. రెడ్ మీట్, స్వీట్లు, షుగర్ జోలికి వెళ్లకుంటే మంచిది. రోజూ 4 నుంచి 5 కిలోమీటర్ల మేర నడిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది.