మంచి మటన్, చికెన్ తాజాగా కనిపిస్తుంది. ఎప్పుడో కట్ చేసిందైతే పాలిపోయినట్టుగా, ఎండిపోయినట్టుగా కనిపిస్తుంది. మటన్ తీసుకునేటప్పుడు దాని నుంచి ఎక్కువగా రక్తం లేదా నీరు కారుతున్నట్లు కనిపిస్తే దాన్ని తీసుకోకపోవడమే ఉత్తమం. బాగా ఎరుపు రంగులో ఉంటే అది ముదిరిపోయిన మటన్ అని అర్థం. అందులో కొవ్వు కూడా ఎక్కువగా ఉంటుంది. గులాబీ, ఎరుపు మధ్య రంగులో ఉండే మటన్ అయితే ఆరోగ్యానికి మంచిది.