ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సందర్భంగా ధోనీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నానని, అయితే అందుకు తాను సిద్ధంగా లేనని ధోనీ చెప్పాడు. స్టేడియంలో అభిమానులు నా పేరు చెప్పగానే తన కళ్లలో నీళ్లు తిరిగాయని వివరించాడు. మరో ఐపీఎల్ ఆడేందుకు ప్రయత్నించానని చెప్పాడు. ఇంకా ప్రేమను ఆస్వాదించాలని కోరుకుంటున్నానని, మరో సీజన్ ఆడేందుకు తన శరీరాన్ని సిద్ధం చేసుకోవడానికి 9 నెలల పాటు కష్టపడాలని ధోనీ చెప్పాడు.