దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు నష్టాలలో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 251 పాయింట్ల నష్టంతో 62,718 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీ 73 పాయింట్లు నష్టపోయి 18,560 దగ్గర ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.73 దగ్గర ట్రేడవుతోంది. షియన్ పెయింట్స్, హెచ్‌సీఎల్ టెక్, సన్‌ఫార్మా, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్, టాటా మోటార్స్, నెస్లే ఇండియా, టైటన్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.