ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వచ్చే ఏడాది పాకిస్థాన్‌తో జరిగే సిరీస్ తర్వాత టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుంటానని ప్రకటించాడు. 2024 జనవరిలో సిడ్నీ వేదికగా పాకిస్థాన్‌తో జరిగే టెస్టు మ్యాచ్ తర్వాత ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతానని పేర్కొన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌పై మరింత దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో సంప్రదాయ టెస్టులకు వీడ్కోలు పలుకుతున్నట్టు వెల్లడించాడు.