చాలామంది శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా కఫం పట్టి జలుబు, దగ్గు వంటి రుగ్మతలు చుట్టుముడతాయి. అలాంటి వాటికి లవంగ టీతో చెక్ పెట్టొచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. లవంగాలు, చిన్న అల్లంముక్క, దాల్చిన చెక్క తీసుకుని రెండు కప్పుల నీళ్లు పోసి బాగా మరిగించి తర్వాత వడకట్టాలి. ఆ నీరు గోరువెచ్చగా మారిన తర్వాత అర చెంచా తేనే కలిపి తీసుకుంటే కఫం నుంచి ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు.