ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 296 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాట్స్మెన్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. మూడో రోజు భోజన విరామం తర్వాత భారత బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కట్టారు. భారత జట్టులో రహానే (89), జడేజా (48), శార్దూల్ ఠాకూర్ (51) పరుగులతో రాణించారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 469 పరుగులు చేయగా, ప్రస్తుతం ఆ జట్టు 173 పరుగుల ఆధిక్యంలో ఉంది.