పంటి నొప్పితో బాధ పడేవారు ఈ చిట్కాలతో నయం చేసుకోవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. పంటి నొప్పి ఉంటే ఉప్పు నీటితో నోటిని శుభ్రపరచుకోవాలని సూచిస్తున్నారు. అలాగే హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్రావణం పుక్కిలించడం వల్ల నొప్పి, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుందని, చిగుళ్లలో రక్తస్రావం తగ్గిస్తుందని చెబుతున్నారు. వెల్లుల్లిని ఆహారంలో తీసుకోవాలంటున్నారు. అలాగే లవంగాలు నోటిలో ఉంచడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుందని పేర్కొంటున్నారు.