దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు లాభాలతో ట్రేడింగ్ ను ప్రారంభించాయి. సెన్సెక్స్ 107 పాయింట్ల లాభంతో 62,733 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 33 పాయింట్ల లాభంతో 18,596 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.44 కొనసాగుతోంది. ఇన్ఫోసిస్, హెచ్ సీఎల్ టెక్, ఎస్బీఐ లైప్ ఇన్సూరెన్స్, అపోలో హాస్పిటల్స్, బీపీసీఎల్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.