మనం నువ్వులను సాధారణంగా వంటల్లో ఉపయోగిస్తుంటాం. కానీ, నువ్వులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా? నువ్వుల్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, యాంటీహిస్టమైన్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే వీటిని 'పవర్ హౌజ్' అని పిలుస్తారు. నల్ల నువ్వుల్లో ఉండే ఔషధ గుణాలు బ్రెస్ట్ క్యాన్సర్ ను నివారిస్తాయి. అలాగే ట్యూమర్ ఏర్పడకుండా నివారిస్తాయి. నువ్వులల్లో ఉండే మూలాశక్తి అల్ట్రావైలెట్ కిరణాలు చర్మంపై పడినప్పుడు ఏర్పడే నల్ల మచ్చలను తొలగిస్తుంది. నువ్వుల్లో ఉండే లిగ్నిన్స్ శరీరంలో ఏర్పడే చెడు కొవ్వును పూర్తిగా తొలగిస్తుంది.