దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు లాభాలతో ట్రేడింగ్ ను ప్రారంభించాయి. సెన్సెక్స్ 212 పాయింట్ల లాభంతో 63,129 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 56 పాయింట్ల లాభంతో 18,744 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.93 వద్ద ట్రేడవుతోంది. అపోలో హాస్పిటల్స్, యాక్సిస్ బ్యాంక్, అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.