భారత యువ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఇప్పటివరకు వన్డే, టీ20, ఐపీఎల్‌లలో రాణించగలిగానని అన్నారు. కానీ భవిష్యత్‌లో ఏదో ఒక రోజు కచ్చితంగా వైట్ జెర్సీ వేసుకుంటానని అన్నారు. అదే తన కల అని తెలిపాడు. 2016లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన చాహల్.. భారత్ తరఫున 147 మ్యాచుల్లో 212 వికెట్లు తీశాడు. ఐపీఎల్లో దాదాపు 187 వికెట్లు సాధించాడు. అయితే ఇంకా భారత్ తరఫున టెస్ట్ క్రికెట్ ఆడలేదు.