అరటిపండు తియ్యగా, రుచిగా ఉండడంతో చాలామంది తినేందుకు ఆసక్తి చూపిస్తారు. అయితే అరటిపళ్లతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. అరటిపళ్లను రెగ్యులర్ గా తీసుకుంటే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. హార్ట్ అటాక్ మరియు గుండె సంబంధిత సమస్యలు రాకుండా రక్షణ కల్పిస్తాయి. వీటిని తినడం వలన రక్తహీనక తగ్గడంతో పాటు బ్లడ్ ప్రెజర్ ను అదుపులో ఉంచుతాయి.