దీపారాధన చేసేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. దీపారాధన చేసేముందు వత్తి వేసి తర్వాత నూనె పోస్తుంటారు కానీ ఇది పద్ధతి కాదు. దీపారాధన చేసేటప్పుడు నూనె పోసి తర్వాత వత్తులు వేయాలి. వెండి కుందులు, పంచ లోహ కుందులు, ఇత్తడి కుందులు మంచివి. మట్టి కుందులు కూడా ఉపయోగించవచ్చు. స్టీలు కుందుల్లో దీపారాధన చేయకూడదు. కుందులను రోజు శుభ్రంగా కడిగిన తర్వాతే ఉయోగించాలి.