దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 185 పాయింట్ల నష్టంతో 63,053 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 66 పాయింట్లు నష్టపోయి 18,704 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.05 దగ్గర ప్రారంభమైంది. సన్‌ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్, టాటా మోటార్స్, మారుతీ, ఎల్‌అండ్‌టీ, ఏషియన్ పెయింట్స్, విప్రో, హెచ్‌యూఎల్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.