ప్రపంచకప్ క్వాలిఫయర్స్ మ్యాచ్‌లో సంచలనం నమోదైంది.సూపర్ ఓవర్లో డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్‌పై నెదర్లాండ్స్ గెలుపొందింది.ఇరు జట్ల స్కోర్లు సమానంగా ఉండటంతో అంపైర్లు సూపర్ ఓవర్ వేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో జాసన్ హోల్డర్ వేసిన ఓవర్లో డచ్ ఆటగాడు లోగన్ వాన్ బీక్ వరుసగా 4, 6, 4, 6, 6, 4తో 30 పరుగులు రాబట్టాడు. అనంతరం బరిలోకి దిగిన వెస్టిండీస్ 8 పరుగులు మాత్రమే చేసింది.