బీసీసీఐ చీఫ్ సెలక్టర్‌గా భారత మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ నియమితులయ్యారు. ఈ మేరకు బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అగార్కర్‌తో పాటు, కమిటీలో శివ సుందర్ దాస్, సుబ్రతో బెనర్జీ, సలీల్ అన్ కోలా మరియు శ్రీధరన్ శరత్ ఉన్నారు. అగార్కర్ భారత్ తరఫున 26 టెస్టులు, 191 వన్డేలు, 4 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 58 వికెట్లు, వన్డేల్లో 288 వికెట్లు, ఐపీఎల్లో 29 వికెట్లు తీశారు.