ఆసియాకప్‌లో బరిలోకి దిగే భారత జట్టుకు కెప్టెన్‌గా యువ ఆటగాడు యష్ ధుల్ ఎమర్జింగ్ ఎంపికయ్యాడు. ఈ నెల 23 నుంచి శ్రీలంకలో జరుగనున్న ఈ టోర్నీకి బీసీసీఐ తాజాగా జట్టును ప్రకటించింది. ఈ జట్టులో తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డికి చోటు దక్కింది. అండర్-23 ఆటగాళ్లు పాల్గొననున్న ఈ టోర్నీలో ప్రభ్‌సిమ్రన్ సింగ్, రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ, ధ్రువ్ జురెల్, రాజ్వర్ధన్, హర్షిత్ తదితరులు జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు.