తొలి టీ20లో విజయం సాధించిన భారత మహిళా క్రికెట్ జట్టు మంగళవారం రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలబడనుంది. తొలి మ్యాచ్‌లో స్పిన్నర్ల విజృంభణకు బ్యాటర్లు హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మందన దూకుడు తోడైంది. దాంతో సునాయాసంగా నెగ్గిన టీమ్ ఇండియా ఇప్పుడు అదే జోరును కొనసాగించాలని అనుకుంటోంది. మూడో మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే దక్కించుకోవాలని హర్మన్ ప్రీత్ సేన భావిస్తోంది.