పిల్లలకు అన్ని రకాల పోషకాలు అవసరం. చదువుకునే పిల్లల మెదడు చురుగ్గా పని చేయాలంటే కోడిగుడ్డు, పెరుగు, ఆకుకూరలు, చేపలు, నట్స్ వంటి ఆహారం అందించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వీటితో విటమిన్స్, ఐరన్, ప్రోటీన్స్ వారికి సమంగా అందుతాయని పేర్కొంటున్నారు. అలాగే కమలాల, బత్తాయి జ్యూస్ పిల్లలకు ఇస్తే విటమిన్ సీ బాగా అంది మెదడు పని తీరు మెరుగు పడడం సహా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని సూచిస్తున్నారు.