కొందరు నీరసం, నిస్సత్తువ, బలహీనత వంటి సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటివారు పల్లీలు, పచ్చికొబ్బరి, పుచ్చగింజల పప్పు, గుమ్మడిగింజల పప్పు, ప్రొద్దు తిరుగుడు పప్పు తింటే శరీరానికి తగినంత బలం చేకూరుతుంది. పచ్చికొబ్బరిని ముక్కలుగా చేసి బెల్లంతో కలిపి తినాలి. పల్లీలు, ఇతర విత్తనాలను విడివిడిగా 8 గంటలు నానబెట్టి తినాలి. వీటిని తీసుకున్న తర్వాత జామకాయను తీసుకోవాలి. ఇలా రోజూ తింటే నీరసం, నిస్సత్తువ వంటి సమస్యలు దూరమవుతాయి.