నేడు తిరుమల శ్రీవారిని ఇస్రో శాస్త్రవేత్తలు దర్శించుకున్నారు. రేపు అనగా శుక్రవారం చంద్రయాన్-3 రాకెట్‌ను నింగిలోకి ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ప్రయోగం విజయవంతం కావాలని మొక్కుకున్నారు. ఈ సందర్భంగా రాకెట్ నమూనాను స్వామివారి పాదాలవద్ద ఉంచి ఆశీర్వాదం పొందారు. శాస్త్రవేత్తలకు ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి.. తీర్థ, ప్రసాదాలు అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa