దేశం నలుమూలల నుండి తిరుపతిని అనుసంధానం చేసే రోడ్లని అభివృద్ధి పరచాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. నేడు తిరుపతి జిల్లాలో 2900 కోట్ల రూపాయల విలువైన జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్ర మంత్రి శంకుస్థాపన శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నితిన్ గట్కరి మాట్లాడుతూ.. 8744 కిలోమీటర్ల హైవేలు ఈ ఏడాది తిరుపతి జిల్లాలో నిర్మిస్తున్నామన్నారు. పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలు పెంచడం ద్వారానే పేదరికం నిర్మూలించగలమని తెలిపారు. రోడ్లు, విద్యుత్తు పరిశ్రమ కావాల్సిన సౌకర్యాలు కల్పన తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. పోర్టులు అభివృద్ధి చెందితే అభివృద్ధి వేగవంతంగా అవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోరటంతో రూ.25 వేల కోట్లతో 1200 కిలోమీటర్లు హైవేలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏడు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రెండు లక్షల కోట్ల రూపాయలతో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో హైవేలు నిర్మిస్తామన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ జీడీపీ దేశంలోని అత్యధికం కాబోతోందన్నారు.