బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించి, నేడు హైదరాబాద్ నుండి నేడు రాష్ట్రాన్ని చేరుకున్న పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ... జాతీయ రహదారులు 8623 కిలోమీటర్ల నిర్మాణాలకు రూ.1 లక్షా 15 వేల కోట్లు కేంద్రం కేటాయించిందన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ రహదారులు వేసిందో సమాధానం చెప్పాలన్నారు. ఎయిర్ పోర్టుల విస్తరణను కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే ఏపీలో అభివృద్ధి జరిగిందన్నారు. విజయవాడ ఎయిర్పోర్టు విస్తరణ, పలు ఎయిర్పోర్టుల నిర్మాణానికి అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల స్ధాపనకు ప్రభుత్వం కృషి చేయలేదని విమర్శించారు.