మాజీ మంత్రి, టీడీపీ నాయకులూ కాలువ శ్రీనివాసులు వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. రైతులని మోసం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైసీపీ ప్రభుత్వమే అన్నారు. మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ఆర్ పంటల భీమా పధకం ద్వారా రైతులతో సీఎం జగన్ ఆటలాడుతున్నారని మండిపడ్డారు. లక్షల్లో పంటకు రైతులు పెట్టుబడులు పెడుతుంటే... పంట నష్టం పరిహారం మాత్రం ఒక గ్రామంలో 20 మంది రైతులకు మాత్రమే అందింది అని తెలియజేసారు. ఇకనైన రైతులకి అండగా ప్రభుత్వం నిలవాలని కోరారు.