శరీరం నుంచి వచ్చే దుర్వాసనలు అనేక రకాలుగా ఉంటాయి. ఒక్కో దుర్వాసన అనారోగ్యాన్ని సూచిస్తుంది. లైంగిక వ్యాధులు, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తదితర రుగ్మతలు ఉన్నవారికి మూత్రం పోసినప్పుడు వచ్చే దుర్వాసన వస్తుంది. మధుమేహం ఉన్నవారిలో పులిసిన పండ్ల వాసన వస్తుంది. కొందరికి నోటి ద్వారా, ముక్కు ద్వారా, చెవి నుంచి దుర్వాసనలు వస్తాయి. ఫంగస్ దాడికి గురైనప్పుడు పాదాలు కంపుకొడతాయి. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు స్థానిక వైద్యుడిని సంప్రదించాలి.