ఎంత సంపాదించినా కొన్ని విధానాలు పాటిస్తే ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉండొచ్చు. సంపాదించిన దాని కంటే తక్కువ ఖర్చు చేయాలి. నెలవారీ ఎంత ఖర్చు చేయాలో ముందస్తు ప్రణాళిక ఉండాలి. అప్పులు, క్రెడిట్ కార్డు రుణాలు వీలైనంత తొందరగా తీర్చేయాలి. జీతంలో కొంత మొత్తం పొదుపు చేసుకోవాలి. అనారోగ్యాల పాలైతే ఆసుపత్రి ఖర్చులు తగ్గించుకునేందుకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవాలి. స్తోమత, ఆసక్తిని బట్టి భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అనువైన రంగాలలో పెట్టుబడి పెట్టాలి.