భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో జరిగే సువర్ణ పుష్పార్చన వేళలను మార్చినట్లు ఈఓ రమాదేవి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ప్రతి ఆదివారం ఉదయం 8. 30 గంటల నుంచి 11. 30 గంటల వరకు సువర్ణ పుష్పార్చన నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ప్రత్యేక దర్శనం టికెట్లు పొందిన భక్తులు ఇబ్బంది పడుతున్నారని, దీంతో సువర్ణ పుష్పార్చన వేళలను ఉదయం 10. 30 నుంచి 12 గంటల వరకు మార్పు చేస్తున్నట్లు ఈఓ తెలిపారు.