మాజీమంత్రి నల్లారి అమర్నాథ్ రెడ్డి వర్ధంతిని ఘనంగా జరిపారు. 37వ వర్ధంతి సందర్భంగా గురువారం కలికిరి పట్టణంలోని మార్కెట్ యార్డ్ లోఅమర్నాథ్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే దివంగత నేత సమాధిని సందర్శించి పూజలు చేశారు. అనంతరం టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు నియోజకవర్గ బాధ్యులు కిషోర్ కుమార్ రెడ్డితో కలిశారు. కార్యక్రమంలో పలువురు టిడిపి శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు.