ప్రస్తుత కాలంలో స్మార్ట్ ఫోన్ వాడే వారందరూ దాదాపుగా ఇయర్ ఫోన్స్ కూడా వాడుతున్నారు. అయితే ఇయర్‌ఫోన్స్ వాడటం వల్ల వినికిడి సమస్యలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇయర్ ఫోన్స్ వాడే నేటితరం పిల్లల్లో ప్రతి ఐదుగురిలో ఒకరికి వినికిడి సమస్యలు వస్తున్నట్టు నిపుణులు గుర్తించారు. అయితే రోజులో ఒక గంటపాటు, అది కూడా 60 శాతం వాల్యూమ్ తో ఇయర్ ఫోన్స్ వాడితే ఎలాంటి సమస్య ఉండదని చెబుతున్నారు.
పరిధి మించిన వాల్యూమ్ కారణంగా చెవిపోటు వస్తుందని, ఆ శబ్ద కంపనాలు కాక్లియాకు చేరి వినికిడి లోపం ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇయర్ ఫోన్స్ వాడినప్పుడు చెవి లోపలి గుమిలి ఇంకొంత లోపలికి పోయి ఇన్ఫెక్షన్లకు దారితీసే ఛాన్సుందని, హెడ్ ఫోన్స్ ద్వారా ఉత్పన్నమయ్యే విద్యుత్ అయస్కాంత తరంగాలు మెదడుకు సమాచారాన్ని తీసుకెళ్లే నరాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. కాబట్టి ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడొద్దని సూచిస్తున్నారు.