బంగాళ దుంపలను సాధారణంగా వంటల్లోకి లేదా స్నాక్స్ లోకి ఉపయోగిస్తుంటారు. అయితే బంగాళదుంపలతో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. బంగాళదుంపలను కాల్చి తీసుకుంటే బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. కాల్చిన బంగాళదుంపలో పొటాషియం, ఫాస్పరస్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. కాల్చిన బంగాళదుంపలో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది. చర్మ సంరక్షణకు సరిపడే అనేక రకాల పోషకాలు ఉంటాయి. గర్భిణీ స్త్రీలు దీన్ని తీసుకుంటే శిశువు మెదడు ఎదుగుదలకు దోహదపడుతుంది.