నూతనంగా ఏర్పడిన అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు మండలం శివకోడులోని ఆక్వా చెరువు సమీపంలో ఓఎన్జీసీ పైపు నుంచి గ్యాస్ లీకవడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. దీనితో స్థానికులు భయబ్రాంతులకు గురౌతున్నారు. మంటలు ఎక్కువగా వ్యాపించకుండా వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. మంటలు అదుపులోకి వచ్చిన వెంటనే గ్యాస్ లీక్పై ఓఎన్జీసీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.