భారత్, బంగ్లాదేశ్ మహిళల జట్ల మధ్య వన్డే సిరీస్ లో భాగంగా నేడు తొలి వన్డే జరగనుంది. ఇప్పటికే 2-1తో టీ20 సిరీస్ ను కైవసం చేసుకున్న భారత్, ఈ మ్యాచ్ లో గెలిచి వన్డే సిరీస్ లోనూ శుభారంభం చేయాలని భావిస్తోంది. కనీసం వన్డే సిరీస్ లో అయినా పైచేయి సాధించాలని బంగ్లా జట్టు పట్టుదలగా ఉంది. నేడు ఉదయం 9 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.