దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 245 పాయింట్లు లాభపడి 66,833 వద్ద, నిఫ్టీ 64.60 పాయింట్ల లాభంతో 19,776 వద్ద ట్రేడవుతోంది. లాభాల బాటలో SBI, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, విప్రో, HDFC బ్యాంకులు పయనిస్తుండగా. ONGC, హీరో మోటోకార్ప్, టాటా మోటార్స్, భారతి ఎయిర్‌టెల్, JSW స్టీల్ కంపెనీలు నష్టాల్లో పయనిస్తున్నాయి.