దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 178 పాయింట్లు పెరిగి 66974 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 50 పాయింట్లు లాభపడి 19799 వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.12 వద్ద ట్రేడవుతోంది. ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, అపోలో హాస్పిటల్స్ షేర్లు లాభాల్లో ఉండగా, ఐషర్ మోటర్స్, సిప్లా, నెస్లె, ఎంఅండ్‌ఎం షేర్లు నష్టాల్లో ఉన్నాయి.