ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ మరోసారి ఉద్యోగులకు షాకిచ్చింది. ఫార్మసీ యూనిట్ లో 80 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది ప్రారంభంలో 18 వేల మంది ఉద్యోగులను తొలగించిన అమెజాన్, తర్వాత 8 వేల మందిని తొలగిస్తామని ప్రకటించింది. దీనిలో భాగంగా ఏప్రిల్ లో అడ్వర్టైజింగ్ యూనిట్ లోని పలువురు ఉద్యోగులను, మే లో మరో 500 మందిని తొలగించింది.