ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ యూజర్లకు షాకిచ్చింది. పాస్ వర్డ్ షేరింగ్ ను ఇండియాలో నిలిపివేసినట్లు ప్రకటించింది. నెట్‌ఫ్లిక్స్ చందా తీసుకున్న వ్యక్తి కుటుంబ సభ్యులు మాత్రమే ఇకపై యాక్సెస్ పొందగలరని స్పష్టం చేసింది. ప్రొఫైల్ బదిలీ, మేనేజ్ యాక్సెస్ అండ్ డివైజెస్ వంటి ఫీచర్లతో ఓటీటీ ప్రయోజనాలను పొందవచ్చని తెలిపింది. సబ్ స్క్రైబర్ల సంఖ్య తగ్గి ఆదాయాన్ని కోల్పోతున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది.