దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు భారీ నష్టాలతో ట్రేడింగ్ ను ప్రారంభించాయి. సెన్సెక్స్ 664 పాయింట్ల నష్టపోయి 66,907 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 189 పాయింట్ల నష్టంతో 19,789 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం 82.03 వద్ద ట్రేడవుతోంది. అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అపోలో హాస్పిటల్, యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.