వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ 143 బంతుల్లో 80 పరుగులు చేశాడు. ఈ క్రమంలో మరో కొత్త రికార్డును సృష్టించాడు. మాజీ కెప్టెన్ మహేంద్రబసింగ్ ధోనీ రికార్డును బ్రేక్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లలో రోహిత్ శర్మ 17,298 పరుగులు చేశాడు. ధోనీ (17,092) స్కోరును రోహిత్ అధిగమించాడు. భారత్ ఆటగాళ్లల్లో అత్యధిక స్కోరు చేసిన వారిలో సచిన్ టెండూల్కర్ (34,357), విరాట్ కోహ్లీ (25,484), రాహుల్ ద్రావిడ్ (24,064), సౌరవ్ గంగూలీ (18,433) ఉన్నారు.