CBSE బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకూ ప్రాంతీయ భాషల్లోనూ బోధనకు అనుమతిచ్చింది. ప్రస్తుతం CBSE స్కూళ్లలో ఇంగ్లిష్, హిందీలో మాత్రమే బోధన సాగుతోంది. కాగా, ఈ నిర్ణయంపై కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసలు కురిపించారు. జాతీయ విద్యా విధానంలో ఊహించినట్లుగా ఇది పాఠశాలల్లో భారతీయ భాషా ఆధారిత విద్యను ప్రోత్సహిస్తుందని చెప్పారు.