టీమ్ ఇండియా మహిళా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు భారీ జరిమానా విధించారు. బంగ్లాదేశ్‌తో టైగా ముగిసిన మూడో వన్డేలో ఆమె అంపైర్ నిర్ణయాన్ని విభేదించడమే కాకుండా కోపంగా బ్యాట్‌ను వికెట్లకేసి కొట్టిన విషయం తెలిసిందే. ఆమె తీరును మ్యాచ్ అఫీషియల్ లెవల్ 2 నేరంగా పరిగణించారు. ఆమెకు 75 శాతం ఫైన్ విధించారు.