వంటలో రుచి కోసం వాడే వెల్లుల్లితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉంటే వెల్లుల్లిని నీళ్లలో మరిగించి.. ఆ నీటిని ఇంటి మూలాల్లో స్ప్రే చేయండి. ఇలా చేయడం వల్ల దోమలు ఇంట్లోకి రావు. చుండ్రుతో బాధపడేవారు 4, 5 వెల్లుల్లి రెబ్బలను గ్రైండ్ చేసి కొంచెం తేనె కలిపి జట్టు మూలాలపై రాసుకుంటే ఫలితం కనిపిస్తుంది. అలాగే రోజూ 3, 4 వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల శరీరంలో కొవ్వును తగ్గించి, రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.