భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌పై సస్పెన్షన్ వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో హర్మన్ అంపైర్ తీరును తప్పుపట్టడమే కాకుండా వికెట్లను బ్యాట్‌తో కొట్టింది. అలాగే బహుమతి ప్రదానోత్సవంలోనూ బంగ్లాదేశ్ కెప్టెన్‌తో ఆమె దురుసుగా ప్రవర్తించింది. దీనిపై సీరియస్ అయిన ఐసీసీ.. హర్మన్ మ్యాచ్ ఫీజులో 75 శాతం కోత విధించింది. తాజాగా ఆమెపై సస్పెన్షన్ వేటు పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.